
తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు తాకింది. అతని జనక్ కార్యాలయం వరదలలో మునిగిపోయింది. ఈ విషయం అమితాబ్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. నిశ్శబ్ధంగా ఉన్న తుఫాను విరుచుకు పడింది. రోజంతా వర్షం పడింది. చెట్లు పడిపోయాయి. సిబ్బంది కోసం నిర్మించిన షెడ్లపై రేకులు ఎగిరిపోయాయి. ప్లాస్టిక్ కవర్ షీట్లు గాలుల వల్ల ఎగిరిపోయాయి. నా సిబ్బంది తడిచినప్పటికీ వారు మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. వారికి నా వార్ట్ రోబ్ నుండి దుస్తులు ఇచ్చాను అంటూ అమితాబ్ తన బ్లాగ్ లో రాసుకొచ్చారు.