
తౌక్టే తుఫాన్ ధాటికి పశ్చిమతీర రాష్ట్రాలైన గుజరాత్ రాజస్థాన్, మహారాష్ట్రలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రానగర్ హవేలి తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తున్నది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే మరో 3 గంటల్లో గుజరాత్ లోని సురేంద్రనగర్ అమ్రేలీ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ హచ్చరించిన నేపథ్యంలో పశ్చిమతీరం లోతట్టు ప్రాంతాల్లోని వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.