
దేశంలో కరోనా వైరస్ కల్లోలం కారణంగా అనారోగ్యంగా మరణించిన వారి మృతదేహాల తరలింపునకు బాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తాజాగా అగ్రాలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించేందుకు అంబులెన్స్ దొరక్క బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు చేసేదేం లేక తమ కారుపైనే మృతదేహాన్ని కట్టి శ్మశాన వాటికకు తరలిండం చూపరులను కంటతడి పెట్టించింది