Ambati Rambabu: పోలీసులను బెదిరించిన ఘటనలో వైసీపీ నేత అంబటి రాంబాబు పై నేసు నమోదు అయ్యింది. బుధవారం గుంటూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులను రాంబాబు బెదిరించారు. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో అంబటి రాంబాబు సహా వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబు పళ్లు కొరుకుతూ నాలుక మడత పెట్టి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.