ఏపీకి ( Andhra Pradesh) భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం విశాఖ ముందు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. దానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు వస్తుండడంతో విశాఖ ఐటీ హబ్ గా మారనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సైతం విశాఖ జిల్లాలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే ఒక్క విశాఖలోనే కాదు తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. అయితే అమరావతి ఇంకా నగరంగా అభివృద్ధి చెందకపోవడంతో అక్కడ ఆశించిన స్థాయిలో పెట్టుబడులు పెరగడం లేదు. అయితే ఒకేసారి 25 బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు నిర్మించడం ద్వారా.. కొత్త సంకేతాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈనెల 25న రిజర్వ్ బ్యాంక్ తో పాటు 25 బ్యాంకులకు సంబంధించిన కార్యాలయాల శంకుస్థాపన జరగనుంది.
* ప్రధాన పొటీదారుగా ఏపీ
ఏపీకి ఎప్పుడు ప్రధాన పోటీదారు బెంగళూరు( Bengaluru). ఎందుకంటే ఇప్పటివరకు ఎటువంటి ఐటి పరిశ్రమలైన బెంగళూరు వైపు వెళ్ళేవి. అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన అనుకూల పరిస్థితి ఉండేది. దిగ్గజ ఐటీ సంస్థల ఏర్పాటుకు ఒక ఎకో సిస్టం పనిచేసేది. కానీ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ పరిశ్రమలతో పాటు దిగ్గజ ఐటీ సంస్థలను ఏపీ వైపు వచ్చేందుకు అవసరమైన అనుకూల పరిస్థితులను కల్పించగలిగారు. దీంతో బెంగళూరు స్థానంలో ఇప్పుడు ఏపీ కనిపిస్తోంది. అయితే బెంగళూరు ఇప్పుడు అమరావతికి పోటీగా కొన్ని ప్రకటనలు చేస్తోంది. వచ్చే జనవరిలో అమరావతిలో క్వాంటం కంప్యూటర్స్ అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందే.. బెంగళూరులో వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించడం విశేషం.
* బెంగళూరులో క్వాంటం కంప్యూటర్..
ఏపీలో అన్ని నగరాలకు పెట్టుబడులు వస్తున్నాయి. కానీ అమరావతికి( Amravati capital) ఇంకా అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఎందుకంటే అక్కడ నగరం ఒక రూపంలో రాకపోవడమే. 29 గ్రామాల్లో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక. ఇప్పటికే ఆర్థిక రంగానికి సంబంధించిన బ్యాంకు ప్రధాన కార్యాలయాలు అమరావతిలో నిర్మితం కానున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో నిర్మాణాలు జరపనున్నారు. అందుకు క్వాంటం వ్యాలీ కంప్యూటర్స్ దోహదపడుతుందని అంతా భావించారు. అయితే తమ అవకాశాలను కొల్లగొట్టి తీసుకెళ్తుందని ఏపీ ఫై కర్ణాటక కు ఒక వ్యతిరేక భావన ఏర్పడింది. అందుకే అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభానికి ముందే.. బెంగళూరులో ప్రారంభించి చూపించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. అందుకే కీలక ప్రకటన చేసింది.