Amanchi Brothers: ఆమంచి కృష్ణమోహన్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రకాశం జిల్లాలో తనకంటూ వ్యక్తిగత చరిష్మ తెచ్చుకున్న నాయకుడు. రోశయ్య శిష్యుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దూకుడు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఆ దూకుడు తోనే చీరాలలో తన మార్కు చూపించగలిగారు. ఇప్పటికీ అక్కడ హవాను కొనసాగిస్తున్నారు. అయితే రాజకీయంగా వేసిన తప్పటడుగులతో ఇబ్బందులు తెచ్చుకున్నారు. ఏ పార్టీ కూడా నమ్మలేని స్థితికి చేరుకున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి టిక్కెట్ దక్కక పోవడంతో చీరాలలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు.
2014లో వైసిపి ఆయనకు టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. త్రిముఖ పోటీలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా మారారు. టిడిపిలో చేరిపోయారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి టర్న్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఖరారు చేసినా.. వైసీపీలోకి వెళ్లిపోయారు. ఆ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. కానీ పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం బలరామకృష్ణ గెలుపొందారు.
అయితే టిడిపి నుంచి గెలుపొందిన కరణం బలరాం వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో అప్పటినుంచి చీరాలలో ఆధిపత్యం కోసం కరణం బలరాముతో ఆమంచి కృష్ణమోహన్ కు గట్టి ఫైట్ నడిచింది. దీంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. ఆమంచి కృష్ణమోహన్ ను పర్చూరు పంపించారు. కానీ అయిష్టత కానీ ఆ పదవి తీసుకున్నారు ఆమంచి. మనసంతా చీరాలపైనే ఉంది. ఈ తరుణంలో కృష్ణమోహన్ సోదరుడు స్వాములు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జిగా మారారు. చీరాల జనసేన టికెట్ కోసమే స్వాములను సోదరుడు కృష్ణమోహన్ పంపించారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. జనసేన టికెట్ స్వాములకు దక్కలేదు. చీరాల కాదు కదా కనీసం గిద్దలూరు టికెట్ కూడా ఆఫర్ చేయలేదు. అటు వైసీపీ సైతం ఆమంచి కృష్ణమోహన్ కు హ్యాండ్ ఇచ్చింది. చీరాలతోపాటు పర్చూర్ కు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ఆమంచి సోదరులు పొలిటికల్ జంక్షన్ పై నిలబడ్డారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే నియోజకవర్గాల్లో గతంలోలా పరిస్థితులు లేవు. దీంతో రాజకీయంగా ఆ సోదరులు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వాటిని ఎలా అధిగమిస్తారో చూడాలి.