పిల్లల కోసం ఆ టీకాను అనుమతించండి.. కేజ్రీవాల్
చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్ కొవిడ్ టీకా సేకరణను వేగవంతం చేయాలని గురువారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి సూచించారు. ఫాస్ట్ ట్రాక్ విధానంలో తమ టీకాకు అనుమతులు మంజూరు చేయాలంటూ ఫైజర్ సంస్థ కోరిన నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్ ఈ విజ్ఞప్తి చేశారు. మన చిన్నారుల కోసం సాధ్యమైనంత త్వరగా ఈ టీకాను మనం సేకరించాలి అని కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ ఫైజర్ మీడియాలో వచ్చిన కథనాన్ని జోడించారు.
Written By:
, Updated On : May 27, 2021 / 03:05 PM IST