https://oktelugu.com/

బ్లాక్ ఫంగస్ కు చెక్ పెట్టాలా.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్ ఫంగస్ తెగ టెన్షన్ పెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నవారే బ్లాక్ ఫంగస్ బాధితులు కావడం గమనార్హం. కరోనా బాధితులకు బ్లాక్ ఫంగస్ సోకడానికి కచ్చితమైన కారణం తెలియడం లేదు. దేశంలో చాలా సంవత్సరాల నుంచి బ్లాక్ ఫంగస్ సమస్య ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎవరైతే ఈ వ్యాధి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : May 27, 2021 2:44 pm
    Follow us on

    ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లను బ్లాక్ ఫంగస్ తెగ టెన్షన్ పెడుతోంది. కరోనా నుంచి కోలుకున్నవారే బ్లాక్ ఫంగస్ బాధితులు కావడం గమనార్హం. కరోనా బాధితులకు బ్లాక్ ఫంగస్ సోకడానికి కచ్చితమైన కారణం తెలియడం లేదు. దేశంలో చాలా సంవత్సరాల నుంచి బ్లాక్ ఫంగస్ సమస్య ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

    ఎవరైతే ఈ వ్యాధి బారిన పడతారో వాళ్ల శరీరంలోని పలు భాగాల్లో నల్లని మచ్చలు ఏర్పడతాయి. కేన్సర్‌ బాధితుల్లో, షుగర్ అదుపులో లేని వారిలో, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఎవరిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.

    ఆక్సిజన్‌ థెరపీ, ఐసీయూలో ఎక్కువ కాలం ఉండడం, కొన్నిరకాల మందులు అతిగా వినియోగించడం, అపరిశుభ్రమైన నీటిని ఆక్సిజన్‌ ఉత్పత్తికి వినియోగించడం, ఎక్కువ మోతాదులో స్టిరాయిడ్స్ వాడటం వల్ల చాలామంది బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. అవసరానికి మించి జింక్‌ మాత్రలను తీసుకోవడం వల్ల కూడా కొంతమంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్టు తెలుస్తోంది. కన్ను, బుగ్గ వాపు వచ్చినా, ఒకవైపు నొప్పి వేధించినా బ్లాక్ ఫంగస్ కావచ్చు.

    ఎంఆర్‌ఐ చేయించడం ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ను నిర్ధారించి ఫంగస్ ను తొలగించవచ్చు. యాంపోటెరిఫిన్‌-బి ఇంజక్షన్ ను 6080 వారాలపాటు ఇవ్వడం ద్వారా బ్లాక్ ఫంగస్ కు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. సకాలంలో గుర్తించి, మెరుగైన వైద్య సేవలు పొందితే బ్లాక్ ఫంగస్ నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.