
వ్యాక్సిన్ కు గ్లోబల్ టెండర్ల వ్యవహరమై కేరళ సీఎం పినరయ్ తో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సీఎం జగన్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల సీఎంలందరూ ఒకే మాట మీద ఉండాలని సీఎం జగన్ కోరారు. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని ముఖ్యమంత్రి జగన్ సీఎంలకు రాసిన లేఖలో స్ఫష్టం చేశారు. గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో ప్రస్తావించారు.