Air India Flight Bomb Threat: ఎయిర్ ఇండియా ఏ 379 విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు థాయిలాండ్ లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. బెదిరింపు కాల్ అనంతరం, ప్రయాణికులను విమానం నుంచి కిందకు దింపేసి విమానంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.