AIMIM Maharashtra Politics : మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ బేస్డ్ ఎంఐఎం పార్టీ విస్తరించింది. హైదరాబాద్ నుంచి జాతీయ స్థాయికి విస్తరించిన ఈ ముస్లిం ఇప్పుడు మహారాస్ట్రలో సత్తా చాటడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆశ్చర్యకరంగా 123 స్థానాల్లో… 13 మున్సిపాలిటీలో గెలవడం విశేషం. అప్పటికీ ఇప్పటికీ 50 శాతానికి పైగా పుంజుకోవడం విశేషం. ఎంఐఎంతో ఎవరికీ పొత్తు లేదు. సొంతంగా గెలిచారు. కాంగ్రెస్ ఆఫర్ చేసినా పొత్తు పెట్టుకోకుండా గెలిచారు.
మెయిన్ స్ట్రీమ్ పార్టీల వైపు ఉన్న ముస్లింలు.. ఇప్పుడు ఎంఐఎం పార్టీ వైపు మరలుతున్నారు. ఇది ఆందోళనకర పరిస్థితి అని చెప్పొచ్చు. 72 శాతం ముస్లింలు ఉన్న మాలేగావ్ లో 2017లో కాంగ్రెస్ కు 28 స్థానాలు వస్తే.. 2026లో ఒక్కటి రాలేదు. ఇస్లాం పార్టీ 35, మజ్లిస్ కు 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు గుండుసున్నా సీట్లు వచ్చాయి.
ఇన్నాళ్లు ముస్లిం ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడేవి. కానీ ఇప్పుడు అసలు ఎవరూ వేయడం లేదు. తమ ముస్లిం సొంత పార్టీల వైపు మళ్లడం అనేది కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ.
మహారాష్ట్రలో విస్తరించిన మజ్లిస్ గురించి ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.