Boyapati And Allu Arjun: ‘భద్ర’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను…ఆ తర్వాత చేసిన తులసి, సింహా, లెజెండ్ లాంటి సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయాడు. ముఖ్యంగా బాలయ్య బాబుతో చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ కి భారీ గుర్తింపైతే వచ్చింది. రీసెంట్ గా బాలయ్య బాబుతో చేసిన ‘అఖండ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు డీలా పడిపోయాడనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.
కానీ ఆ వార్తలు నిజమయ్యే విధంగా కనిపించడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. కాబట్టి బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలైతే లేవు… ఇక రీసెంట్ గా లోకేష్ కనకరాజు డైరెక్షన్లో సినిమా చేస్తున్నాను అంటూ ఓపెన్ గా ప్రకటించారు.
కాబట్టి ఆయన బోయపాటితో సినిమా చేసే అవకాశాలైతే లేవు. ఇక అల్లు అర్జున్ – బోయపాటి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సరైనోడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఒక రకంగా అల్లు అర్జున్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది బోయపాటి శ్రీను అనే చెప్పాలి. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తే చూడడానికి అల్లు అర్జున్ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ వీళ్ళ కాంబోలో సినిమా ఇప్పుడప్పుడే వచ్చే అవకాశాలు కనిపించడం లేదు… అఖండ 2 సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ బోయపాటితో సినిమా చేస్తానని చెప్పారట. కానీ అఖండ 2 సినిమా తేడా కొట్టింది..కాబట్టి ఇప్పుడు బోయపాటి సైతం అల్లు అర్జున్ కి కథ చెప్పే అవకాశం లేకుండా పోయింది… ఫ్యూచర్లో ఈ కాంబినేషన్లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…