Anil Ravipudi: కమర్షియల్ సినిమాలను సక్సెస్ ఫుల్ గా తెరకెక్కించగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు. హీరోల మేనరిజమ్స్ ని బట్టి కథను రాసుకొని ప్రేక్షకులు హీరో ను ఎలాగైతే చూడాలనుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్ లో ఆ హీరోను ప్రేక్షకులకు చూపించడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. దానివల్లే అతని సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోయినా కూడా ఏదో ఒక మ్యాజిక్ చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ఉంటాడు. గత సంవత్సరం వెంకటేష్ కి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందించిన ఆయన ఈ సంక్రాంతికి చిరంజీవికి మన శంకర వరప్రసాద్ సినిమాతో భారీ సక్సెస్ ని కట్టబెట్టాడు… ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలవడంతో 100% సక్సెస్ రేట్ కలిగి ఉన్న దర్శకులలో తను కూడా ఒకరి గా మారిపోయాడు… ప్రస్తుతం అతనితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు.
మరికొంతమంది ప్రొడ్యూసర్స్ అతనికి అడ్వాన్స్ ల రూపంలో బీభత్సమైన డబ్బులను కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది… కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్లు సైతం అనిల్ రావిపూడికి బ్లాంక్ చెక్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి సైతం తను చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.
తనకు సక్సెస్ లు ఉన్నాయి కాబట్టే భారీ ఆఫర్లు వస్తున్నాయని గమనిస్తున్నాడు. దానివల్ల అతను ఏ ప్రొడ్యూసర్లు ఇచ్చిన బ్లాంక్ చెక్కులు తీసుకోవడం లేదట. తనకు ఇంతకుముందు ఉన్న కమిట్మెంట్స్ ప్రకారమే సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను దిల్ రాజుతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. వెంకటేష్ తో సినిమా ఉంటుందట.
ఈ మూవీ ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాకి సీక్వల్ గా వస్తుందా? లేదంటే ఫ్రెష్ కథతో తెరకెక్కబోతోందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తనకున్న సక్సెస్ ల వల్ల ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తున్నాడనే చెప్పాలి. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు కాబట్టి ప్రతి ప్రొడ్యూసర్ అతనితో సినిమా చేయడానికి సార్ సన్నాహాలు చేస్తున్నారు…