
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్చువల్ సమ్మిట్ ‘రైజ్ 2020’ ఈరోజు ప్రారంభమైంది. ఈ సమ్మిట్ 5రోజుల పాటు జరగనుంది. సామాజిక సాధికాతర కోసం బాధ్యతాయుత కృత్రిమ మేధ ఈ సమ్మిట్ యొక్క థీమ్. ప్రారంబోత్స్వ ఉపన్యాసం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ సాంకేతిర రంగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని భవిష్యత్తులో భారత్ ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ కు గ్లోబల్ హబ్ గా మారనున్నదని అన్నారు. సాంకేతిక రంగం వల్ల పారదర్శకత పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని అన్నారు.