AI matrimonial aap : సోషల్ మీడియాలో ఏవైనా వీడియోలు సర్పింగ్ చేస్తూ ఉంటే.. కళ్ళజోడు పెట్టుకున్న ఓ వ్యక్తి వచ్చి.. ఇది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి అంటాడు కదా.. ఆ వీడియో దెబ్బతో అతడు ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత మినిమం డిగ్రీ అనే మాట కామన్ అయిపోయింది. పైగా కొన్ని పెద్దల వీడియోలు.. పెద్దల దృశ్యాలకు సంబంధించిన చర్చలో అతడు మాట్లాడిన మినిమం డిగ్రీ మాటలు చర్చనీయాంశమవుతున్నాయి. పెద్దల చిత్రాలు, పెద్దల వీడియోలే కాదు.. ఇప్పుడు ఒక అంశానికి సంబంధించిన వ్యవహారంలో మినిమం డిగ్రీ కాదు, మినిమం 50 లక్షలు సంపాదించాలి. అలా సంపాదించే సత్తా ఉన్న మగవాళ్లకు మాత్రమే అందులోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇంతకీ అదేంటంటే..
నేటి కాలంలో మగవాళ్లకు వివాహాలు జరగడం లేదు. అమ్మాయిలు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కెరియర్, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు.. అనేక విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఆ తర్వాతే ఒప్పుకుంటున్నారు. దీంతో చాలామంది అబ్బాయిలు వివాహాలు కాకుండానే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో మాట్రిమోనియల్ సైట్లను చాలామంది మగవాళ్ళు ఆశ్రయిస్తున్నారు. మనదేశంలో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా పెళ్లి చూపులు జరగడం.. వివాహాలు నిశ్చయం కావడం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో మాట్రిమోనియల్ సైట్లల్లో కూడా సరికొత్త మార్పులు వచ్చాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన నేపథ్యంలో.. మ్యాట్రిమోనియల్ సైట్ లలో కూడా కృత్రిమ మేధ ప్రవేశించింది. ఇప్పుడు దానికి సంబంధించి ఒక చర్చ నడుస్తోంది. ఒక మహిళ న్యాయవాది దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు భారత వైవాహిక వ్యవస్థ లో పెను ప్రకంపనలకు నాంది పలుకుతోంది.
ఆ యువ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం.. భారత వివాహ రంగంలోకి కొత్తగా నాట్ డాట్ డేటింగ్ అనే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ యాప్ ప్రవేశించింది. ఈ యాప్ పూర్తి విభిన్నమైనది. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా నడుస్తుంది. అయితే ఇది అందరూ భారతీయుల కోసం కాదు. ఇది కేవలం టాప్ వన్ శాతం భారతీయుల కోసం మాత్రమే. ఇందులో రిజిస్టర్ అవ్వడానికి.. సంబంధాలు ఎంక్వయిరీ చేయడానికి పురుషులు తక్కువలో తక్కువ కనీసం ఏడాదికి 50 లక్షల వరకు సంపాదించాలి. ఇందులో రిజిస్టర్ అవ్వడానికి మహిళలకు ఎటువంటి షరతులు లేవు. దీనిని ఇద్దరు పురుషులు సృష్టించారు.
50 లక్షలు సంపాదించడం మాత్రమే కాదు, అతని కుటుంబ నేపథ్యం కూడా సక్రమంగా ఉండాలి. అతడు చెప్పే వివరాలు మొత్తం పూర్తిగా నిజమై ఉండాలి. అప్పుడే అతడు ఇందులో ప్రవేశించడానికి అర్హతను సాధిస్తాడు. కొత్త సంబంధాలను కనుగొంటాడు. ఫేక్ వివరాలు కనుక సమర్పిస్తే వెంటనే అతడి అకౌంట్ డిలీట్ అవుతుంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ తరహా మ్యాట్రిమోనియల్ సైట్ రన్ కావడం మనదేశంలో ఇదే తొలిసారి. మాట్రిమోనియల్ సైట్లలో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పురుషులకు 50 లక్షల నిబంధన ఇబ్బందికరంగా ఉందని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.