Most Fan Following Heroes: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అనగానే పెద్ద సినిమాలు గుర్తొస్తాయి. ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఫైనల్ గా వాళ్లకు దక్కిన విజయాన్ని, వాళ్ల సినిమాలు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ను బట్టే హీరోల క్రేజ్ అనేది డిసైడ్ చేయబడుతోంది.అలాగే వాళ్ళ మార్కెట్ సైతం ఏ రేంజ్ లో ఉంది అనేది తెలియాలంటే వాళ్ళు చేస్తున్న సినిమాలను బట్టి నిర్ణయిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే పాన్ ఇండియాలో ప్రతి ఒక్క హీరో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా స్టార్ హీరోలందరు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా?లేదా అనే కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో టాప్ 3 హీరోలు ఎవరు అనే దానిమీద ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి… ఇక ఇప్పుడు ఇండియాలో ఉన్న హీరోలందరు సాధించిన కలెక్షన్స్ ను బట్టి వాళ్లకు ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసిన ఆయన ఆ తర్వాత చేసిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుషు, స, కల్కి లాంటి సినిమాలతో వరుసగా పాన్ ఇండియా కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. బాహుబలి, సలార్, కల్కి సినిమాలకు విశేషమైన స్పందన వస్తోంది.
ఇక బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం చకచక జరిగిపోయాయి. అందుకే ప్రస్తుతం ప్రభాస్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడనే చెప్పాలి. ఇక అతని తర్వాత షారుక్ ఖాన్ ఉన్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ ఖాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన గత కొన్ని రోజుల నుంచి భారీ సక్సెస్ లను సాధించడం లేదు.
అట్లీ డైరెక్షన్ లో వచ్చిన ‘జవాన్’ సినిమాతో సూపర్ హిట్ సాధించి తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకున్నాడు. ఆయన క్రేజ్ తార స్థాయికి వెళ్ళిపోయింది…ఇక మూడో పొజిషన్లో అల్లు అర్జున్ ఉన్నాడు. ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రుని షేక్ చేశాడు.
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా అల్లు అర్జున్ జపం చేస్తున్నారు. అలాంటి స్టార్ హీరో చేయబోతున్న సినిమాలతో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే పాన్ ఇండియాని షేక్ చేస్తున్న హీరోల్లో ఈ ముగ్గురు టాప్ 3 లో ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అందులో ఇద్దరు తెలుగు హీరోలు ఉండడం నిజంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మన నటులకు పాన్ ఇండియా లో దక్కిన గొప్ప గౌరవమనే చెప్పాలి…