
అమరావతి భూముల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈనెల 22న దీనిపై విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అమరావతి భూములపై సీఐడీ, సిట్ దర్యాప్తును నిలుపుదల చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ పిటిషన్ పై ఈ నెల 22న విచారణ జరపనున్నట్లు తాజాగా సుప్రీంకోర్టు వెల్లడించింది.