
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కోరుతూ ముంబైకి చెందిన న్యాయవాది బాంబే హైకోర్టులో పిటిషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. టీకా సరఫరాకు సంబంధించి పూనావాలాను బెదిరించిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని న్యాయవాది దత్తా మానే కోర్టుకు విజ్ఞప్తి చేశారు. టీకా తయారీ దాులు అభద్రతా భావానికి గురైతే వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. టీకా విషయంలో తనపై అనూహ్యమైన ఒత్తిడి ఉందని అదర్ పూనావాలా ఇటీవల ఓ ఇంటర్వ్యలో పేర్కొన్నారు.