
అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీ షేర్లు పతనమైన్టుల తెలుస్తోంది. అదానీ గ్రూపునకు చెందిన సుమారు 43 వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేయడంతో ఆ కంపెనీ షేర్లు డౌనయ్యాయి. అల్ బులా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ కంపెనీల నిధులను ఎన్ ఎస్ డీఎల్ నిలిపివేసింది.