
బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ కరోనా వైరస్ కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత మూడు రోజులుగా కరోనాకు చికిత్స తీసుకుంటున్న అభిలాష ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. స్వర్గీయ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చిచోర్ చిత్రంలో అభిలాషా పాటిల్ మంచి పేరు సంపాదించారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నారు. మరాఠీ సీరియల్ బాప్ మనుస్ తో పాటు పలు సీరియళ్ల లో నటించి మరాఠీల అభిమాన తారగా వెలుగొందారు.