కరోనా సెకెండ్ వేవ్ భయం జనంలో పెద్దగా కనిపించడం లేదు. కరోనా కారణంగా ఫలానా వ్యక్తి చనిపోయాడట అని వార్త తెలిసినప్పుడు బాధ పడి, అలాగే కాస్త భయపడి మళ్ళీ సాయంత్రానికి కరోనాని లైట్ తీసుకుంటున్నారు. మరీ జనం ఎలాగూ కరోనాను పట్టించుకోవట్లేదు, ఇక ప్రభుత్వాలు ఎలా పట్టించుకుంటున్నాయో తెలిసిందే, అలాంటప్పుడు మా బిజినెస్ ను ఎందుకు ఆపుకుని కూర్చోవడం ? అంటూ ఆలోచనలో పడ్డారు మూవీ మేకర్స్.
అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతల మధ్య జూమ్ మీటింగ్స్ మొదలయ్యాయి. కరోనా తీవ్రత ఉన్నా.. మనం ఎప్పుడు థియేటర్లు ఓపెన్ చేద్దాం ?, ఒకవేళ ఓపెన్ చేస్తే జనం వస్తారా ? వచ్చినా మనిషికి మనిషికి మధ్య సీట్ వదిలేయాల్సిందేనా ? అంటూ చర్చలు చేస్తున్నారు సినిమా పెద్దలు. మరో పక్క కొత్త సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు సినిమా ప్రియులు.
కానీ ఓటీటీల పై మాత్రం సినిమా వాళ్లకు ఇంకా చిన్న చూపే ఉంది. తమ సినిమాలను ఓటీటీలలో రిలీజ్ చేయడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అందుకే థియేటర్ రిలీజ్ కోసం తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను పోస్ట్ ఫోన్ చేసుకున్నారు. అయితే, ఇప్పట్లో ఎలాగూ సింగిల్ ధియేటర్లు తెరుచుకుంటాయనే ఆశ లేదు. పోనీ ఐనాక్స్, పివిఆర్ చేయిన్ థియేటర్స్ అయినా ఓపెన్ చేస్తారా ?
మల్టీ ఫ్లెక్స్ లు కాబట్టి, కరోనా నివారణ చర్యలకు తగ్గట్టు టికెట్స్ ను కూడా ఈజీగా కేటాయించొచ్చు. కాబట్టి జూలై రెండో వారంలో అన్ని మల్టీ ఫ్లెక్స్ లు తెరుచుకునే అవకాశం వుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పైగా జూన్ నుండే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మల్టీ ఫ్లెక్స్ ల్లో ఒక స్క్రీన్ ను కచ్చితంగా తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.