spot_img
Homeఎంటర్టైన్మెంట్Aamir Khan third marriage : గ్రాండ్ గా ౩వ పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్.....

Aamir Khan third marriage : గ్రాండ్ గా ౩వ పెళ్లి చేసుకున్న అమీర్ ఖాన్.. వధువు ఎవరంటే.. ఫోటోలు వైరల్..

Aamir Khan third marriage : గత కొంతకాలంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ 3 వ పెళ్లి పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో చర్చ జరుగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక మూవీ ఈవెంట్ కి అమీర్ ఖాన్ తన కాబోయే భార్య , అదే విధంగా తన ఇద్దరి మాజీ భార్యలతో కలిసి ఒకే కారులో వెళ్లిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. రీసెంట్ గానే ఆయన తన ప్రేయసి గౌరీ స్ప్రాట్ ని పెళ్ళబోతున్నట్టు అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు కూడా. అయితే నేడు బాంద్రా లోని తన సొంత నివాసం లో , మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ పెళ్ళాడి, మ్యారేజ్ పేపర్స్ మీద సంతకాలు చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ వివాహ వేడుకకు అమీర్ ఖాన్ , గౌరీ కుటుంబ సభ్యులతో పాటు , అతి కొద్దిమంది సన్నిహితులు కూడా హాజరయ్యారు. అయితే అమీర్ ఖాన్ కి సంబంధించిన సినీ స్నేహితులు మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది. ఆయనకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మంచి చిరకాల మిత్రుడు అనే సంగతి అందరికీ తెలిసిందే , ఆయన కూడా వివాహ వేడుకకు హాజరు కాకపోవడం గమనార్హం. ఈ పెళ్ళికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం , వీళ్ళు కూడా రిసెప్షన్ కి ఏర్పాటు చేస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ రిసెప్షన్ ఏర్పాటు చేస్తే మాత్రం బాలీవుడ్ కి చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ 1986 వ సంవత్సరం , ఏప్రిల్ 18 న రీనా దత్త అనే హీరోయిన్ ని పెళ్లాడాడు.

వీళ్ళ దాంపత్య జీవితం 15 ఏళ్ళు సాఫీగానే సాగింది , ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ 2002 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005 వ సంవత్సరం లో కిరణ్ రావ్ ని పెళ్లాడిన అమీర్ ఖాన్ 2021 వ సంవత్సరం లో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్ ని పెళ్లాడారు , ఈమెతో అయినా జీవితాంతం కలిసి ఉంటారో లేదో చూడాలి. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతానికి ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఒప్పుకోలేదు. త్వరలోనే రీసెంట్ గానే ‘3 ఇడియట్స్’ మూవీ సీక్వెల్ స్క్రిప్ట్ ని డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ అమీర్ ఖాన్ ని కలిసి వివరించారు , దీనికి అమీర్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి కానీ , ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular