
ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని టీడీపీ సీనియర్ నాయకుడు అయన్నపాత్రుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి వచ్చి పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోవాలని హితవు పలికారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల చదువుల బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు.