
కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేసిన ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు మే 20న కొలువుదీరే కొత్త కేబినేట్ లో చోటు దక్కలేదని సమాచారం. ఆమెకు మంత్రి పదవి కేటాయించకుండా పార్టీ విప్ గా నియమిస్తారని తెలుస్తోంది. మే 20వ తేదీన 21 మంది ఎమ్మెల్యేలతో కొత్త మంత్రి వర్గం ఏర్పాటు చేయనున్నట్లు ఎల్డీఎఫ్ ప్రకటించింది. ఆ జాబితాలోకేకే శైలజ పేరు ఉందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసిన క్రమంలో శైలజకు కేబినేట్ స్థానం దక్కలేదని వార్తలు వినిపిస్తున్నాయి.