
అడవిలో ఉండే వన్యప్రాణులు కాస్తా విశాఖలో జనవాసాల మద్యలోకి వస్తున్నాయి. విశాఖ జిల్లా, మధురవాడ జాతీయ రహదారి పైకి ఒక జింక్ పరుగులు పెడుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న వాహనదారులు కాస్తా జింక్ పరుగులను తమ ముబైల్ ఫోన్ లో విడియోలు తీసి సోషల్ మీడియాలో ఫోస్ట్ లు చేసారు. అయితే అటవి శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాటు సంరక్షణ లోపంతో వన్యప్రాణులు కాస్తా రోడ్డుపైకి వచ్చేస్తున్నాయి. ఏదైనా వాహనం కింద జింక్ పడితే పరిస్థితి ఏంటీ అని వన్య ప్రాణా సంరక్షకులు నెట్టింటా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో భారీ వాహనాల చక్రల క్రింద పడి జింకలు చనిపోయిన సంఘటన జరిగి ఉన్నాయి .