https://oktelugu.com/

ఖరారు: వైఎస్ షర్మిల పార్టీ పేరు ఇదే!

ఎట్టకేలకు వైఎస్ షర్మిల బయటపడ్డారు. తన పార్టీ పేరును రిజిస్ట్రర్ చేయించారు. ఎన్నికల కమిషన్ లో నమోదు చేయించారు. దీంతో షర్మిల పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుమీదనే ఆయన కూతురు వైఎస్ షర్మిల పార్టీ పేరును ఖరారు చేయడం విశేషం. తెలంగాణలో రాజకీయ ప్రవేశం కోసం వివిధ జిల్లాల అనుచరులు, వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. ప్రజా సమస్యలు, తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని దీక్షలు చేశారు. ఇక […]

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2021 / 10:02 PM IST
    Follow us on

    ఎట్టకేలకు వైఎస్ షర్మిల బయటపడ్డారు. తన పార్టీ పేరును రిజిస్ట్రర్ చేయించారు. ఎన్నికల కమిషన్ లో నమోదు చేయించారు. దీంతో షర్మిల పార్టీ పేరుపై క్లారిటీ వచ్చింది.

    దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుమీదనే ఆయన కూతురు వైఎస్ షర్మిల పార్టీ పేరును ఖరారు చేయడం విశేషం. తెలంగాణలో రాజకీయ ప్రవేశం కోసం వివిధ జిల్లాల అనుచరులు, వైఎస్ అభిమానులతో సమావేశాలు నిర్వహించారు. ప్రజా సమస్యలు, తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని దీక్షలు చేశారు.

    ఇక త్వరలోనే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. షర్మిల పార్టీ పేరుపై తాజాగా లీకులు బయటకు వచ్చాయి. సోషల్ మీడియా ఖాతాలో అదే పేరుతో దర్శనమిస్తున్నా.. పార్టీ పేరు కూడా అదేనని సమాచారం.

    ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పేరు ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇదే పేరుతో ఢిల్లీలో ఎన్నికల కమిషన్ వద్ద షర్మిల అనుచరుడు రాజగోపాల్ రిజిస్ట్రర్ చేసినట్టు సమాచారం. ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’ పేరుపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలుపాలని ఓ జాతీయ పత్రికలో ప్రకటన కూడా ఇచ్చారట.. దీంతో వైఎస్ షర్మిల పార్టీ పేరు ఖరారు అయినట్టు అయ్యింది.