
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంట్లలో 83,690 మంది నమూనాలు పరీక్షించగా 8,976 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 90 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. గడచిన 24 గంటల్లో 13,568 కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,23,426 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.