
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, డిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా కేసుల్లో 74.53 శాతం ఉన్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంద్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1,69,60,172కు చేరింది. ఒకే రోజు 3.49 లక్షల కేసులు నమోదయ్యాయి. ఇందులో కర్ణాటక, కేరళ, ఛత్తీస్ గడ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్ తో పాటు రాజస్థాన్ రాష్ట్రాల్లో 74.53 శాతం కేసులు నమోదయ్యాయి.