
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత వేధిస్తుండటంతో కొత్తగా 551 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం పీఎం కేర్స్ నిధులను వెచ్చించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వం ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ట్వీట్ లో తెలిపిన వివరాల ప్రకారం ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు ఇచ్చారు.