
ఒక వైపు కరోనా దేశాన్ని కలవరపెడుతుంటే మరోవైపు బ్లాక్ ఫంగస్ దాడి చేస్తూ కలవర పాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో 50 బ్లాక్ ఫంగస్ కేసులను అక్కడి శివరాజ్ సింగ్ చౌహన్ గుర్తించింది. తాజాగా గుజరాత్ లోని సూరత్ లో 55 కేసులు వెలుగుచూశాయి. మ్యూకోర్ మైకోసిస్ పిలిచే ఈ వ్యాధితో మరణించే అవకాశాలున్నాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఎదురయ్యే సమస్యల్లో ఇది ఒకటి. 25 కేసులను సివిల్ ఆసుపత్రి, 20 ఇతన ఆసుపత్రుల్లో గుర్తించామని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ హెల్త్ కమిషనర్ ఆశిశ్ నాయక్ వెల్లడించారు.