
దేశంలో విలయ తాండవం చేస్తున్న కరోనా వైరస్ కట్టడికి మాస్క్ ధరించడం తప్పనిసరంటూ వైద్యరంగ నిపుణులు, ప్రభుత్వాలు పదే పదే హచ్చరిస్తున్నా అనేక మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో సగం మంది ఇంకా మాస్క్ లు పెట్టుకోవడం లేదని కేంద్రం వెల్లడించింది. మాస్క్ లు ధరిస్తున్నవారిలో కూడా 64 శాతం మంది ముక్కును కప్పి ఉంచేలా సరిగా పెట్టుకోవడం లేదని ఓ అధ్యయనంలో తెలిందని పేర్కొంది. 20 శాతం మంది గడ్డం దగ్గరకు మాస్క్ తీసుకొచ్చి ఉంచుతున్నారని, మరో 2 శాతం మంది మెడ దగ్గర ఉంచుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది.