
ఇటీవల్ల కాలంలో కురుస్తున్న వర్షాలకు రాష్టంలో చాలా చోట్ల వరదలు సంభవించి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చాల వరకు జరిగింది. వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారికీ 5లక్షల నగదు అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. కృష్ణ, నెల్లూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్ లతో సమావేశమైన జగన్ వరదలపై సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలను త్వరగా పంపాలని ఆయన కలెక్టర్ లను ఆదేశించారు.