
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4,801 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన 7,430 మంది కోలుకున్నారు. తీవ్ర ఇన్ ఫెక్షన్ కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,06,988కి పెరిగాయి. వరిలో 4,44,049 మంది కోలుకున్నారు. ఈరోజు వరకు 2,803 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 75,289 శాంపిళ్లను పరీక్షించారు.