
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 97,236 శాంపిల్స్ పరీక్షించగా 3527 మందిలో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. కొత్తగా 19 మంది ప్రాణాలు కోల్పోగా 3982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 519 కొత్త కేసులు నమోదు కాగా ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం 215 కేసులు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 27,793 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 92.81 శాతం ఉంది.