
దేశంలో అతిపెద్ద కరోనా వ్యాక్సిన్ దిగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో వేదికైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్ -వి టీకాలు నేడు భారత్ కు చేరుకున్నాయి. మూడో విడతలో మరో 27.9 లక్షల టీకా డోసులు దిగుమతి అయ్యాయి. రష్యా నుంచి ప్రత్యేక చార్టర్డ్ ప్రైటర్ ఆర్ యూ- 9450 విమానం ఈ టీకాలను తీసుకుని మంగళవారం తెల్లవారుజూమున 3.43 గంటల ప్రాంతంలో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోకు చేరుకుంది. 90 నిమిషాల్లో దిగుమతి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కు తరలించారు.