https://oktelugu.com/

కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలు..

దేశంలో ఇప్పటి వకు సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి కోవిషీల్డు, భారత్ బయోటెక్ నుంచి కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డు వ్యాక్సిన్ తీసుకున్నవారు 6-8 వారాల గ్యాప్ తరువాత రెండో డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభంలో 4 నుంచి 6 వారాల గ్యాప్ ఉంచి ఆ తరువాత 6 నుంచి 8 వారాల గ్యాప్ ఇచ్చింది. అయితే తాజాగా 12 నుంచి 16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2021 9:46 am
    Follow us on

    దేశంలో ఇప్పటి వకు సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి కోవిషీల్డు, భారత్ బయోటెక్ నుంచి కోవాగ్జిన్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కోవిషీల్డు వ్యాక్సిన్ తీసుకున్నవారు 6-8 వారాల గ్యాప్ తరువాత రెండో డోస్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రారంభంలో 4 నుంచి 6 వారాల గ్యాప్ ఉంచి ఆ తరువాత 6 నుంచి 8 వారాల గ్యాప్ ఇచ్చింది. అయితే తాజాగా 12 నుంచి 16 వారాలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అయితే కోవాగ్జిన్ విషయంలో ఏమార్పు ఉండదని అంటోంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రతిపాదనలు లేవని వారు పేర్కొన్నారు.

    భారత్ మినహా మిగతా దేశాల్లో 12 నుంచి 16 వారాల గ్యాప్ తో రెండో డోస్ ఇస్తున్నారు. స్పెయిన్లో గరిష్టంగా 16 వారాల గ్యాప్ ఇచ్చారు. అయితే రెండో డోస్ కు 12 వారాల గ్యాప్ ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ 81.2 శాతం మెరుగ్గా పనిచేస్తున్నట్లు గతంలో డబ్లూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. అలాగే ఆరు వారాల గ్యాప్ తో ఇస్తే 55.1 శాత మేరకు ఉంటుందని తెలిపారు. దీంతో యూకె, యూరప్ దేశాలు 12 వారాల గ్యాప్ ను మెయింటేస్ చేస్తున్నారు.

    గతంలో భారత్ కు ఈ విషయంపై సూచించినా పట్టించుకోలేదు. కోవిషీల్డు వ్యాక్సిన్ రెండో డోస్ గ్యాప్ ను 12 వారాలు ఉంచాలని నిపుణుల కమిటీ సిపారసు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని తిరస్కరించిందని కోవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు తెలిపారు. దీంతో 6 నుంచి 8 వారాల గ్యాప్ మాత్రమే ఉంచిందన్నారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కారణంగానే ప్రభుత్వం 12 వారాల గడువు పెంచినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    అయితే కేంద్ర మాత్రం ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాలను ప్రాతిపదికగా చేసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది. యూకెలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 12-16 వారాల గ్యాప్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా అదే అమలు చేయాలని అనుకుంటున్నాం అని అంటోంది. అయితే వ్యాక్సిన్ల కొరత కారణంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 12-16 వారాల గ్యాప్ పెంచడం వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలున్నాయని కొందరు ప్రశ్నిస్తున్నారు.