
కరోనాపై పోరుకు కొత్త ఔషధం 2 డియాక్సీ డి- గ్లూకోజ్ అభివృద్ధి చేసినట్లు డీఆర్ డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి తెలిపారు. 2డీజీ ఔషధం కొవిడ్ పై సమర్థంగా పని చేస్తోందన్నారు. ఈ ఔషధానికి డీఆర్ డీవో పేటెంట్ కూడా పొందినట్లు ఆయన వివరించారు. ఈ మందు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. త్వరలో ప్రజలకు అందుబాటులోకి 2డీజీ ఔషధం వస్తుందని సతీశ్ రెడ్డి తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి దీన్ని రూపొందించామని ఆయన తెలిపారు.