
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,08,696 నమూనాలను పరీక్షించగా 2,384 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,83,228కి పెరిగింది. కరోనా మహమ్మారితో ఇవాళ 17 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 3,313కి పెరిగింది. ఇవాళ 2,242 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జికాగా రాష్ట్రంలో 33,379 క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యరోగ్యశాఖ వెల్లడించింది.