
కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్ డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ కు ముందు నిందితులు తమకున్న పరిచయాలతో భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి దాచారు. మధురై పోలీసులు శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా దందా బాగోతం వెలుగు చూసింది.