బీజేపీ టార్గెట్: రేవంత్ వ్యూహాత్మక రాజకీయం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అందరు వారించినా లెక్కచేయకుండా పీసీసీ పీఠం దక్కించుకున్న రేవంత్ ఇప్పుడు అందరిని కలుపుకుని వెళ్తున్నారు. సొంత పార్టీ నుంచి ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రూటు మార్చారు. పార్టీని గట్టెక్కించడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక ఎక్కడ బీజేపీ తనకు పోటీ వస్తుందో అని దానికి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. రాష్ర్టంలో ఇప్పటికే టీఆర్ఎస్ బలంగా […]

Written By: Srinivas, Updated On : July 21, 2021 4:36 pm
Follow us on

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అందరు వారించినా లెక్కచేయకుండా పీసీసీ పీఠం దక్కించుకున్న రేవంత్ ఇప్పుడు అందరిని కలుపుకుని వెళ్తున్నారు. సొంత పార్టీ నుంచి ఇబ్బందులు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రూటు మార్చారు. పార్టీని గట్టెక్కించడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇక ఎక్కడ బీజేపీ తనకు పోటీ వస్తుందో అని దానికి చెక్ పెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు.

రాష్ర్టంలో ఇప్పటికే టీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పోరాటం బీజేపీతో కాదని టీఆర్ఎస్ తోనే అని భావిస్తున్నారు. తనకు ప్రధాన పోటీదారు టీఆర్ఎస్ అనే కోణంలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వ్యతిరేకులు బీజేపీలోకి వెళ్లకుండా చూస్తున్నారు. ముందే వారిని కలుస్తూ వారిని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ ఇంటకి కూడా వెళ్లి ఆయనను కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా సూచించారు.

దీంతో బీజేపీలోకి వలసలు ఆగిపోయాయి. ఇన్నాళ్లు చాలా మంది బీజేపీలో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్న క్రమంలో వారిని అడ్డుకుంటున్నారు. రీసెంటుగా దామోదర్, ధర్మపురి సంజయ్ లాంటి కీలక నేతలు బీజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ గూటికి చేరుస్తున్నారు. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా పార్టీని గాడిలో పెడుతున్నారు. బీజేపీ బలం పెరగకుండా నిరోధించేందుకు కదులుతున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరిని కలుపుకుని పోతున్నారు. సీనియర్లను కలుపుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలకు సిద్ధం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెరవకుండా నేతలను రెడీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. బీజేపీకి అంత ప్రాధాన్యం ఇవ్వకుండా టీఆర్ఎస్ ను మాత్రం తన పోటీదారుగా భావించి దాంతోనే పోరాడేందుకు నాయకులను కార్యోణ్ముఖులను చేస్తున్నారు.