
టీమ్ ఇండియా 1983 ప్రపంచకప్ హీరోల్లో ఒకరైన యశ పాల్ శర్మ (66) మంగళవారం మరణించారు. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో ఆయన కన్ను మూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. భారత్ తరఫున యశ్ పాల్ 37 టెస్టులు ఆడారు. 1,606 పరుగులు చేశారు. 42 వన్డేల్లో 883 పరుగులు చేశారు. 1983 ప్రపంచకప్ సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఆయన చేసిన శతకం అందరికీ గుర్తుండిపోతుంది.