ట్రాన్స్ జెండర్లకు నెలకు 1,500 ఆర్థిక సాయం

మహమ్మారి జీవితాలను అతలాకుతలం చేసింది. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే ఇక ట్రాన్స్ జెండర్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిలో చాలా మంది యాచక వృత్తిని పాటిస్తూ పొట్ట పోసుకుంటారు. లాక్ డౌన్ తో అన్ని బంద్ కావడంతో వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రాన్స్ జెండర్లకు […]

Written By: Suresh, Updated On : May 25, 2021 7:16 pm
Follow us on

మహమ్మారి జీవితాలను అతలాకుతలం చేసింది. వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే ఇక ట్రాన్స్ జెండర్ ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిలో చాలా మంది యాచక వృత్తిని పాటిస్తూ పొట్ట పోసుకుంటారు. లాక్ డౌన్ తో అన్ని బంద్ కావడంతో వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రాన్స్ జెండర్లకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. ట్రాన్స్ జెండర్స్ కోసం పని చేస్తున్న ఎన్ జీఓలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు వారికి అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాము అని సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కోరారు.