
కోవిడ్ బాధితుల కోసం 104 కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. నేడు జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 104 కాల్ సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ఈ నంబర్ కు బాధితుల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే వారి సమస్యకు సరైన పరిష్కారం చూపాలన్నారు.