పవన్ కళ్యాణ్ నన్ను ట్రై చేశాడు: జ్యోతి

ఐటమ్ ఆర్టిస్ట్ జ్యోతి తెలుసు కదా.. చాలా తెలుగు సినిమాల్లో హాట్ హాట్ పాత్రలకు జీవం పోసి.. నిర్మాతల పై కాసుల వర్షం కురవడానికి తన వంతుగా ఒళ్ళు విరుచుకుని మరీ ఘాటు సన్నివేశాలలో హీట్ పెంచింది. నిజానికి వదిన..అక్క.. తల్లి పాత్రల్లో నటించాలని ఎప్పటి నుండో తానూ కలలు కంటున్నానని.. కానీ ఆంటీ పాత్రలు మాత్రమే తనకు ఎక్కువుగా వచ్చాయని ఇప్పుడు తీరిగ్గా జ్యోతి మిక్కిలి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తోంది. చేస్తే చేసింది. ఇప్పుడు […]

Written By: admin, Updated On : April 28, 2021 10:41 am
Follow us on

ఐటమ్ ఆర్టిస్ట్ జ్యోతి తెలుసు కదా.. చాలా తెలుగు సినిమాల్లో హాట్ హాట్ పాత్రలకు జీవం పోసి.. నిర్మాతల పై కాసుల వర్షం కురవడానికి తన వంతుగా ఒళ్ళు విరుచుకుని మరీ ఘాటు సన్నివేశాలలో హీట్ పెంచింది. నిజానికి వదిన..అక్క.. తల్లి పాత్రల్లో నటించాలని ఎప్పటి నుండో తానూ కలలు కంటున్నానని.. కానీ ఆంటీ పాత్రలు మాత్రమే తనకు ఎక్కువుగా వచ్చాయని ఇప్పుడు తీరిగ్గా జ్యోతి మిక్కిలి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తోంది.

చేస్తే చేసింది. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్సే పవర్ స్టార్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. గత రెండు రోజులుగా జ్యోతి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అడిగిన వాళ్లకు అడిగినట్టు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితంలోని సీక్రెట్స్ ను బయటపెట్టేస్తోంది. ఈ క్రమంలో పవన్ గురించి కూడా కొన్ని కామెంట్స్ చేసింది.

సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా మాట్లాడడని, తన పని ఏదో తాను చూసుకుంటాడని.. అలాంటిది మొదటిసారి పవన్, షూటింగ్ సమయంలో తన మీద కవిత్వం రాసేశారని, పవన్ కళ్యాణ్ తనని ట్రై చేశాడని అన్నట్టు జ్యోతి సెన్సేషనల్ కామెంట్ చేసింది. గుడుంబా శంకర్ సినిమాలో జ్యోతి, పవన్ కళ్యాణ్ మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. బహుశా ఆ సీన్స్ షూటింగ్ సమయంలోనే పవన్ సరదాగా ఈ హాట్ ఆంటీ పై కొన్ని సరదా కామెంట్స్ చేసి ఉండొచ్చు. దానికి పవన్ తన గురించి కవిత్వం రాశాడని జ్యోతి ఇప్పుడు చెప్పుకుంటుంది.

ఏది ఏమైనా జ్యోతి కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక జ్యోతి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆమె తన భర్తకు దూరంగా ఉంటుంది. కొడుకును పెంచుకుంటూ సింగిల్ మహిళగా ఆమె దైర్యంగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, అతని దగ్గరి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన డబ్బులతో బతుకుతున్నానని, పిల్లాడిని పోషించుకుంటున్నానని జ్యోతి చెప్పింది. ఈ విషయంలో జ్యోతిని అభినందించకుండా ఉండలేము.