Homeజాతీయం - అంతర్జాతీయంటోక్యో ఒలింపిక్స్: సెమీస్ లో ఓడిన భారత మహిళా హాకీ జట్టు

టోక్యో ఒలింపిక్స్: సెమీస్ లో ఓడిన భారత మహిళా హాకీ జట్టు

ఒలింపిక్స్ లో అసాధారణ పోరాటంతో తొలిసారి సెమీస్ కు చేరిన భారత్ మహిళల టీమ్ ఫైనల్ చేరలేకపోయింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో మన టీమ్ పోరాడి ఓడిపోయింది. దీంతో ఇక బ్రాంజ్ మెడల్ కోసం బ్రిటన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి ఇండియన్ టీమ్ కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ తర్వాత మరో గోల్ సాధించలేకపోయారు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36 వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్ లో 1-0 లీడ్ లోకి దూసుకెళ్లిన ఇండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్ లో రాణి రాంపాల్ టీమ్ కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular