
గుంటూరు జిల్లా వినుకొండలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న మనస్తాపంతో రైలు కింద పడి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ప్రశాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకొడు గ్రామానికి చెందిన యువతి- యువకుడిగా పోలీసులు గుర్తించారు. శతకొడు గ్రామానికి చెందిన ఆదం వలీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదంవలీకి ఇటీవల పెద్దలు వివాహం నిశ్చయించడంతో నాలుగు రోజుల క్రితం ప్రేమించిన యువతితో పారిపోయాడు. ఇవాళ వినుకొండ సమీపంలో రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.