
దేశంలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాల్లో ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో ప్రజలు డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ బారిన పడితే ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అధిక ఆకలి, తరచుగా మూత్రవిసర్జన, అలసట, చిరాకు డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి.
ముఖ్యంగా మూడు లక్షణాల ద్వారా డయాబెటిస్ బారిన పడ్డామో లేదో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సాధారణంగా వ్యక్తి యొక్క నోటి ఆరోగ్యం చక్కెర స్థాయిలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ ప్రారంభ లక్షణాలలో పొడి నోరు ఒకటి. మందులను వాడటం వల్ల ఈ సమస్యను సులభంగా నియంత్రించే అవకాశం ఉంటుంది.
పగుళ్లు, పగిలిన పెదవులు, నోటిలో పుండ్లు, మింగడం, మాట్లాడటంలో ఇబ్బందులు, పొడి నాలుక, నోటిలో తేమ లేకపోవడం లాంటి లక్షణాలు ఉంటే షుగర్ పరీక్షలు చేయించుకుంటే మంచిది. పొడినోరు లాలాజల ఉత్పత్తిని ప్రభావితం చేయడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశం ఉంటుంది. చిగుళ్ళ వ్యాధి ఉండటం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉందని చెప్పడానికి సూచన అని చెప్పవచ్చు. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారితో పోలిస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులు సగటున రెండింతలు దంతాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.
డయాబెటిక్ రోగి రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడం వల్ల నోటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. దంత సంరక్షణను పట్టించుకోకపోతే మాత్రం నోటి సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.