https://oktelugu.com/

రూ. మూడు వేల కోట్లు.. రాజ్ కుంద్రా లీలలు

పోర్న్ రాకెట్ కుంభకోణంలో ఇరుక్కున్న రాజ్ కుంద్రాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బాగోతాలు ఒక్కొక్కటికిగా వెలుగు చూస్తున్నాయి. రాజ్ కుంద్రా మోసాలకు లెక్క లేకుండా పోతున్నాయి. పోర్న్ కుంభకోణంతోపాటు పలు మార్గాల ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ రామ్ కదమ్ రాజ్ కుంద్రాపై సరికొత్త ఆరోపణలు చేశారు. ఆయన ప్రజలను పలు కోణాల్లో ముంచారని పేర్కొన్నారు. వీడియో గేముల పేరుతో ప్రజలను దాదాపు మూడు వేల కోట్ల వరకు దోచుకున్నారని ధ్వజమెత్తారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 1, 2021 6:04 pm
    Follow us on

    Raj Kundra Case

    పోర్న్ రాకెట్ కుంభకోణంలో ఇరుక్కున్న రాజ్ కుంద్రాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన బాగోతాలు ఒక్కొక్కటికిగా వెలుగు చూస్తున్నాయి. రాజ్ కుంద్రా మోసాలకు లెక్క లేకుండా పోతున్నాయి. పోర్న్ కుంభకోణంతోపాటు పలు మార్గాల ద్వారా అక్రమంగా డబ్బులు సంపాదించినట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ రామ్ కదమ్ రాజ్ కుంద్రాపై సరికొత్త ఆరోపణలు చేశారు. ఆయన ప్రజలను పలు కోణాల్లో ముంచారని పేర్కొన్నారు. వీడియో గేముల పేరుతో ప్రజలను దాదాపు మూడు వేల కోట్ల వరకు దోచుకున్నారని ధ్వజమెత్తారు.

    ఆయన నిర్వాకంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వెల్లడించారు. దీంతో రాజ్ కుంద్రా మెడకు మరో ఉచ్చు బిగుసుకోవచ్చని భావిస్తున్నారు. ఇందులో ఆయన భార్య శిల్పాశెట్టి హస్తం కూడా ఉందని గుర్తు చేశారు. దీంతో లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. శిల్పాశెట్టి ఇమేజ్ ను ఉపయోగించుకుని అడ్డదారుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. మోసాలన్ని ఆమెకు తెలిసే జరిగాయని అంటున్నారు. ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే వారిని కొట్టి పంపేసేవారని అన్నారు.

    ఇప్పటికే జైలు జీవితం గడుపుతున్న రాజ్ కుంద్రాపై మరిన్ని కేసులు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ పక్క శివసేన, కాంగ్రెస్ నాయకులు సైతం వారికి మద్దతు ప్రకటించకపోవడంతో ఇప్పుడు బీజేపీ ఎదురు తిరగడంతో రాజ్ కుంద్రాకు శిక్ష తప్పదని భావిస్తున్నారు. రాజ్ కుంద్రా ఎలాంటి రాజకీయ మద్దతు లేకపోవడంతో ఇక కేసులో సీరియస్ పెరుగుతుందని తెలుస్తోంది. బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన పోర్న్ చిత్రాల కుంభకోణంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. దీంతో అందరికి శిక్షలు ఖాయమనే తెలుస్తోంది. అడ్డదారుల్లో అక్రమాలకు పాల్పడితే అంతేసంగతి. ఎప్పటికైనా ఊచలు లెక్కపెట్టక తప్పదని చెబుతున్నారు.

    ఇందులో ఇప్పటికే కొందరు తారలు కూడా రాజ్ కుంద్రాపై కేసులు పెట్టడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచారు. నిజానిజాలు నిగ్గు తేలే వరకు పోలీస్ కస్టడీలోనే ఉంచే వీలుంది. గత ఫిబ్రవరిలోనే రాజ్ కుంద్రా వ్యవహారంపై కేసు నమోదు కాగా ఇన్నాళ్లు పక్కా ఆధారాల కోసం ఆగాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా కేసు ఎటు వైపు వెళుతుందో అని విశ్లేషకులు భావిస్తున్నారు.