
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇవాళ మధ్యాహ్నం ఆయన భేటీ కానున్నారు. రమణ తెరాసలో చేరతారనే ఊహాగానాలు ఇటీవల బాగా వినిపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలోని పలువురు నేతలతో చర్చించి, వాళ్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే రమణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.