
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకు కోలకతా హైకోర్టు జడ్జి కౌశిక్ చందా 5 లక్షల జరిమానా విధించారు. బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ మమతా బెనర్జీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ కేసును జడ్జి కౌశిక్ తప్పుకోవాలని మమతా కోరారు. దీంతో ఆ కసుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి కౌశిక్ చందా తెలిపారు. జడ్జికి కళంకం తెచ్చే విధంగా సీఎం మమతా ముందస్తుగా ప్రణాళిక వేసుకున్నట్లు కౌశిక్ ఆరోపించారు.